Chief Justice of India NV Ramana
న్యూఢిల్లీ : మధ్యవర్తులకు శిక్షణ ఇస్తే పేదలకు చాలా మేలు జరుగుతుందని సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఇండియా – సింగపూర్ మీడియేషన్ సమ్మిట్‌లో ఎన్వీ రమణ పాల్గొని మాట్లాడారు. మధ్యవర్తిత్వం తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, మధ్యవర్తిత్వంతో సామాన్య ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. వివాద సమస్యల పరిష్కారాల్లో రాజ్యాంగ సమానత్వం ఉండాలని ఆయన చెప్పారు. మధ్యవర్తులు సలహాదారులుగా మారడం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. మధ్యవర్తులు మంచి గుణం, నైతికత విలువలు, తటస్థ గుణం కలిగి ఉండి పారదర్శకతతో ఉండాలని ఆయన తెలిపారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యవర్తులకు నైతిక అనిశ్చితి ఉంటుందని ఆయన వివరించారు. తెలంగాణ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలు ఏర్పాటు చేస్తోందని, ఇతర రాష్ట్రాలు కూడా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలు ఏర్పాటు చేయాలని రమణ తేల్చిచెప్పారు.
Chief Justice N.V. Ramana was speaking at the India - Singapore Mediation Summit 2021, organised by Singapore International Mediation Centre (SIMC), in strategic partnership with CAMP Mediation, and Mediation Mantras.